నాడు గంటా...నేడు అవంతి..మంత్రిగా భీమిలి ఎమ్మెల్యే - avanthi swearing as minister
మంత్రిగా చేయాలన్నది ఆయన కల... అందుకే భీమిలి నుంచి పోటీ చేస్తానని పట్టుబట్టారు. చివరకు తన ఆప్తమిత్రుడు గంటా శ్రీనివాసరావుతో విభేదాలొచ్చినా వెరవలేదు. చివరి నిమిషంలో వైకాపాలోకెళ్లారు. భీమిలి సీటు తెచ్చుకున్నారు. ఘన విజయం సాధించి....మంత్రిగా ప్రమాణం చేశారు.
నాడు గంటా...నేడు అవంతి..మంత్రిగా భీమిలి ఎమ్మెల్యే
సచివాలయ వేదికగా రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణస్వీకార వేడుక జరిగింది. విశాఖ జిల్లా నుంచి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు వైకాపా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
TAGGED:
avanthi swearing as minister