ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్వర్టును ఢీకొని కొండవాగులో పడిన ఆటో... ఐదుగురికి గాయాలు - visakha agency latest accident news

విశాఖ ఏజెన్సీలో అదుపుతప్పిన ఆటో కొండవాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు రైతులకు గాయాలయ్యాయి. వీరిని తాజంగి ఆసుపత్రికి తరలించారు.

auto rolled down after hitting culvert in visakha agency
బురిసింగి- మామిడిపల్లి మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదం

By

Published : Aug 18, 2020, 7:44 PM IST

ఆటో అదుపుతప్పి కొండవాగులో పడిన ఘటన విశాఖ ఏజెన్సీలో జరిగింది. చింతపలల్లి మండలం తాజంగికి చెందిన రైతులు శనగకాయల బస్తాలను ఆటోలో వేసి... లోతుగడ్డు సంతకు బయలుదేరారు. ఘాటీ దిగుతున్న సమయంలో ఆటో అదుపు తప్పింది.

బురిసింగి- మామిడిపల్లి మధ్య కల్వర్టును ఢీకొని కొండవాగులో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాజంగి ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ప్రాణ నష్టం తప్పడంపై రైతులు ఊపిరిపీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details