ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుక్క అడ్డం వచ్చి ఆటో బోల్తా.. వ్యక్తి మృతి - గుడుగుపల్లి ప్రమాదం

కుక్క అడ్డం వచ్చిందని.. ఆ ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరు మన్యంలో జరిగింది.

man died
ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి

By

Published : Aug 3, 2020, 2:00 PM IST

కుక్క అడ్డు రావటంతో.. ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరు మన్యంలో జరిగింది. గుడుగుపల్లికి చెందిన ఢిల్లేశ్వరరావు హుకుంపేట నుంచి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరాడు. గుడుగుపల్లికి సమీపంలోకి వచ్చేసరికి... ఆటోకి కుక్క అడ్డం రావటంతో, ఢిల్లీశ్వరరావు బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఢిల్లీశ్వరరావు తలకి ఆటోలో ఇనుప రాడ్​ తగిలి... రక్తస్రావమై మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details