ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేరాల అదుపులో ఆటో డ్రైవర్లు సహకరించాలి : పోలీసులు - Vishakapatnam Police

విశాఖపట్నంలో పోలీస్ అధికారులు ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఇటీవలే జరుగుతున్న నేరాాల్లో ఆటో డ్రైవర్లదే అధిక పాత్ర కనిపిస్తోందని పోలీసులు పేర్కొన్నారు. నేరాలు తగ్గాలంటే పోలీసులకు ఆటో డ్రైవర్లు సహకరించాలని స్పష్టం చేశారు.

నేరాల అదుపులో ఆటో డ్రైవర్లు సహకరించాలి : పోలీసులు
నేరాల అదుపులో ఆటో డ్రైవర్లు సహకరించాలి : పోలీసులు

By

Published : Oct 16, 2020, 8:30 PM IST

నేరాల నియంత్రణలో పోలీసులకు ఆటో డ్రైవర్లు సహకరించాలని విశాఖ పోలీసులు పిలుపునిచ్చారు. ప్రశాంతతకు మారు పేరైన విశాఖలో నేరాలకు పాల్పడే ఆసాంఘిక శక్తులను గుర్తించి వారిని కట్టడి చేయడానికి ఆటో డ్రైవర్లు క్షేత్ర స్ధాయిలో తోడ్పాటు అందించాలన్నారు. విశాఖలో ఆటో డ్రైవర్లు, యూనియన్ల ప్రతినిధులతో డీసీపీలు ఐశ్వర్య రస్తోగి, సురేష్ బాబు, డీటీసీ రాజారత్నం ఇతర పోలీస్ ఉన్నతాధికార్లు సమావేశం నిర్వహించారు.

వాటిల్లో మీ పాత్రే ఎక్కువ..

కొంత కాలంగా దారి దోపిడీలు, మహిళలపై అత్యాచార యత్నాలు, ఛైన్ స్నాచింగ్ ముఠాలు, కొట్లాటలు, హత్య, దాడులు వంటి ఘటనల్లో ఆటో డ్రైవర్ల పాత్ర ఎక్కువగా కన్పిస్తోందని అధికారులు రికార్డులు బహిర్గతం చేశారు. గడచిన ఏడాది కాలంలో దాదాపు 20 ఘటనల్లో పలువురు ఆటో డ్రైవర్లు అరెస్ట్ అయిన విషయాన్ని వెల్లడించారు.

కొంతమంది నీతి నీజాయితీగా..

కొన్ని చోట్ల ఆటోలో ప్రయాణించే వారికి సంబంధించి విలువైన పత్రాలు, నగలు, నగదు దొరికినపుడు సమీప పోలీస్ స్టేషన్ లో అప్పగించి నిజాయితీ చాటుకున్న అటో డ్రైవర్లు ఉన్నారన్న అంశాలను ప్రస్తావించారు. వీరికి ప్రత్యేకంగా గుర్తింపు పత్రాలను ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు.

నేరాల అదుపులో ఆటో డ్రైవర్లు సహకరించాలి : పోలీసులు

ఇవీ చూడండి : గుంటూరు జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు...నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details