విశాఖ జిల్లా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద ఇద్దరు ఆటో డ్రైవర్లు ఏఎస్ఐపై దాడి చేశారు. రహదారికి అడ్డంగా ఉన్న ఆటోలు తొలగించమని ఏఎస్ఐ వాటిపై కర్రతో మోదారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆయన్ను పట్టుకుని కొట్టారు. అడ్డుకున్న మరో వ్యక్తిపైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఏఎస్ఐకి గాయాలైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎస్సై... సినీ ఫక్కీలో ఇద్దరినీ చితకబాది స్టేషన్కి తీసుకెళ్లారు. విధుల్లో ఉండగా చేయి చేసుకున్నందుకు ఆటో డ్రైవర్లపై కేసు నమోదు చేశారు.
ఏఎస్ఐపై ఆటో డ్రైవర్లు దాడి - paderu crime news
రహదారికి అడ్డంగా ఉన్న ఆటోలు తీయమన్నందుకు పోలీస్ అధికారిపై ఇద్దరు ఆటో డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఈ చర్యకు ఒడిగట్టారు. విశాఖ జిల్లా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన ఘటన వివరాలివి..!

auto drivers attacked asi in paderu