ఈనెల ఐదో తేది రాత్రి పదిన్నర గంటల సమయంలో మధురవాడ వెళ్లేందుకు ఆసీల్మెట్ట వద్ద ఆటో ఎక్కాడు మహేష్. మద్యం మత్తులో తన స్నేహితుడికి ఫోన్ చేసి.. తన వద్ద డబ్బులున్నాయి.. పార్టీ చేసుకునేందుకు రావాలని పిలిచాడు. ఈ మాటలు విన్న ఆటో డ్రైవర్ లక్ష్మీ నరసింహ మూర్తి తన స్నేహితుడైన మరో డ్రైవర్ దుర్గా శ్రీరామ్‌కు ఫోన్ చేసి ప్రయాణికుడి దగ్గర నగదు ఉందని.. వస్తే దోచుకోవచ్చని చెప్పాడు. అనుకున్న ప్రకారం హనుమంతువాక్ దగ్గర శ్రీరామ్ ఆటో ఎక్కాడు. పీఎం పాలెం క్రికెట్ స్టేడియం వద్దకు రాగానే నిర్మానుష్యమైన ప్రదేశంలోకి తీసుకెళ్లి మహేష్ నుంచి రూ.15 వేలు నగదు, సెల్‌ఫోన్ తీసుకొని పరారయ్యారు.
నిందితులను పట్టించిన ఆటో లైట్లు... ఎలా అంటే.. - auto drivers arrest in chori case at visakhapatnam news
ఆటోకున్న లైట్లు ఇద్దరు నిందితులను పట్టుకోవడంలో ఉపయోగపడ్డాయి. బాధితుడు చూసిన ఆ గుర్తులే కేసు విచారణలో కీలకంగా మారాయి. ఆటో ఎక్కిన వ్యక్తి నుంచి నగదు అపహరించిన కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై బాధితుడు పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా.. నిందితులు వివరాలు, ఆటో గుర్తులపై పోలీసులు ఆరా తీశారు. ఆటోకు ముందు, సీటు కింది భాగాల్లో నీలం రంగు దీపాలు అమర్చినట్లు బాధితుడు సమాచారమిచ్చాడు. నగరంలో అలాంటి ఆటోల కోసం గాలించారు. ఎట్టకేలకు మద్దిలపాలెం, పెదగదిలి కూడలి వద్ద ఆటో డ్రైవర్లను పట్టుకోగా వారు నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిపై గతంలో ఎలాంటి నేరాలు నమోదు లేవని,.. జల్సాల కోసం దోపిడీకి ప్రయత్నించినట్లు క్రైమ్ డీసీపీ వి.సురేష్ బాబు తెలిపారు.
ఇవీ చూడండి...