ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదలని బండి... ఆటోవాలా బతుకెలా? - ఆటో డ్రైవర్లపై కరోనా ప్రభావం

విశాఖలో ఆటోడ్రైవర్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఎక్కే ప్రయాణికులు తగ్గిపోయారు. నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ఇప్పుడు నగరంలో సిటీ బస్సు సర్వీసులు మొదలు పెట్టిన తర్వాత అసలు ఆటో ఎక్కేనాథుడు కరవయ్యాడు. ఈ కారణంతో ఆటో డ్రైవర్ల జీవన స్థితిగతులు దుర్భరంగా మారాయి.

auto driver difficulties at vishakapatnam due to corona
ఆటో డ్రైవర్ల కష్టాలు

By

Published : Oct 9, 2020, 1:07 PM IST

విశాఖ జిల్లాలో కరోనా ప్రభావంతో తర్వాత ఆటోడ్రైవర్లు అనేక కష్టాలు ఎదురుకొంటున్నారు. కరోనా కారణంగా మూడు నెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు. లాక్​డౌన్ నిబంధనలు సడలించిన అనంతరం ఆటోలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ప్రయాణించే నిబంధన వచ్చింది. అందువల్ల కనీసం ఛార్జ్ రూ. 30 లు చేశారు. అయినా ఎలాంటి ఆదాయం రాలేదు. ఇప్పుడు సిటీ సర్వీస్ బస్సులు మొదలు పెట్టారు. నగరవాసులు సిటీ అర్బన్ సర్వీస్ బస్సులు వినియోగిస్తున్నారు. కనీసం రోజుకి అన్ని ఖర్చులు పోను ఒక్కపుడు ఐదు వందలు వచ్చేది ఇప్పుడు కనీసం వంద రూపాయలు రావడంలేదని ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు. పైగా ఆటో ప్రయాణికుడికి డ్రైవర్​కి మధ్య ప్లాస్టిక్ తెరలు కడుతున్నారు. శానిటైజర్ కొడుతున్నారు. ఐనా ప్రయాణికులు ఆటోవైపు చూడటంలేదని.. కనీస కుటుంబ ఆదాయ అవసరాలు తీరటం లేదని ఆటో డ్రైవర్లు బాధ పడుతున్నారు.

కరోనా కారణంగా వేల మంది ఆటో డ్రైవర్ల బతుకు వీధిన పడిందని ఆటో కార్మిక సంఘ నేతలు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఒక్కరిద్దరు ఆటో ఎక్కే ప్రయాణికులు కూడా బస్సు ఎక్కేందుకు మొగ్గుతున్నారని అంటున్నారు. ఆటో డ్రైవర్లు ఆటోలు అమ్మేసుకుని వేరే వృత్తులు చేస్తునట్టు చెప్తున్నారు. వాహన మిత్ర కింద సహాయం చేసిన ప్రభుత్వం.. ఆటో కార్మికులను ఆదుకోవడానికి రుణ రూపేణా సహాయం చేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నారు.

విశాఖపట్నం నగరంలో అధికారికంగా 25 వేల ఆటోలు ఉన్నాయి. కొంత మంది ఉపాధి కోసం ఈ ఆటోలపైనే జీవిస్తున్నారు. కనీసం రోజు గడిచే డబ్బులు కూడా రాకపోవడంతో ఆటో నడపడం మానేసి అద్దె కార్లపై జీవిస్తున్నారు. మునుముందు ఇదే పరిస్థితి కొనసాగితే ఇక జీవనం సాగించడం కష్టమని అంటున్నారు.

ఇదీ చదవండి:న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించారా..? : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details