విశాఖ జిల్లా గాజువాక చినగంట్యాడ ప్రాంతానికి చెందిన శివ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ భార్య భిడ్డలతో జీవిస్తున్న ఇతను... లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవటంతో ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాడు. రోజూ మాదిరే ఇవాళ ఉదయాన్నే మార్కెట్‌కి వెళ్లి ఉల్లిపాయలు తెచ్చి వీధుల్లో అమ్మాడు. మధ్యాహ్నం అమరావతి పార్కుకు వెళ్లి ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడని మృతుడి బాబాయి అప్పారావు తెలిపారు. కుటుంబ కలహాలు ఏమీ లేవని చెప్పారు.
గాజువాకలో ఆటోడ్రైవర్ బలవన్మరణం - vishaka district crime news
గాజువాకలో ఆటో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో అమరావతి పార్కులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Auto driver commited suicide in gajuwaka