ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆపదలో ఆదుకున్నారు.... అందరికీ ఆదర్శమయ్యారు - Vishakha News

కొబ్బరి చెట్టు ఎక్కనిదే అతనికి పూట గడవదు. వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుని హాయిగా జీవించేవాడు. ప్రమాదవశాత్తు ఓ రోజు చెట్టుపై నుంచి కింద పడ్డాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినా.. నడవలేని పరిస్థితి అతనిది. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో రెండు సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పటికీ అతను కోలుకోలేదు.కుటుంబ పోషణ బరువై అల్లాడుతున్న కుటుంబానికి చేయూతనందించాలని ఎ.ఎం.ఎ.ఎల్ కళాశాల విద్యార్థులు సంకల్పించారు. ఆర్థిక సహాయం చేశారు. దాతలు సైతం ముందుకు రావాలని కోరుతున్నారు.

ఆపదలో ఆదుకున్నారు.... పలువురికి ఆదర్శమయ్యారు.
ఆపదలో ఆదుకున్నారు.... పలువురికి ఆదర్శమయ్యారు.

By

Published : Nov 17, 2020, 7:33 PM IST

విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం కాపుల వాతాడకు చెందిన దమ్ము శివ రెండేళ్ల క్రితం కొబ్బరి చెట్టు నుంచి కాయలు కోస్తున్న క్రమంలో కింద పడ్డాడు. నడుము భాగం కింద పనిచేయకపోవటంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. తన వద్ద ఉన్న సొమ్ముతో చికిత్స చేయించుకున్నాడు. ఇంకా ఉన్న డబ్బంతా అయిపోవటంతో పూటగడవటానికే ఇబ్బందిగా ఉంది. ఈ పరిస్థితిని గమనించిన అనకాపల్లిలోని ఎ.ఎం.ఎ.ఎల్ కళాశాల విద్యార్థులు ఉదారత చాటుకున్నారు. అప్పటికే పలు సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరు తనకు చేయూతనందించారు.

విద్యార్థులు పది లక్షల 60 వేల 208 రూపాయలు పోగు చేశారు. శివకు భార్య, 7 ఏళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మంచానికి పరిమితం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ఈ విద్యార్థులు తొలుత ఆర్థిక సాయం 3వేల రూపాయలు అందించారు. అంతేగాక తనకు మరింత మంది నుంచి సాయం అందించేలా కృషి చేశారు. శివ పరిస్థితిని వీడియో తీసి దాతల సహాయం అందించాలి అంటూ సోషల్ మీడియాలో పెట్టారు.

మంచి స్పందన వచ్చింది. విద్యార్థులు చూపిన సేవాభావాన్ని పలువురు కొనియాడారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని శివ వాపోయాడు. దివ్యాంగుల పింఛను సైతం అందడం లేదన్నారు. తన పరిస్థితిని చూసి విద్యార్ధులు దాతలు అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు సాయం చేయాలని కోరుతున్నాడు.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో విచ్ఛలవిడిగా ఇసుక దోపిడి: అయ్యన్న

ABOUT THE AUTHOR

...view details