విశాఖ జిల్లా అనకాపల్లిలో పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టడంపైరెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. అనకాపల్లి వైకాపా ఎంపీ సత్యవతికి చెందిన.. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయానికి రేషన్ బియ్యం తరలించడం సంచలనం రేపింది. దీనిపై విశాఖ సంయుక్త జాయింట్ కలెక్టర్ శివ శంకర్ రెవెన్యూ అధికారులతో విచారణ జరిపించారు. రేషన్ బియ్యం ప్రైవేట్ ట్రస్ట్‌కి అక్రమంగా తరలించినట్లు తేల్చారు. అనకాపల్లిలోని ఎమ్మెల్సీ పాయింట్ సూపర్వైజర్ వెంకటరమణతోపాటు.. 30వ నంబర్ రేషన్ డిపో డీలర్ భవానిని సస్పెండ్ చేశారు. వైకాపా ఎంపీకి చెందిన ట్రస్ట్‌పైనా కేసు నమోదు చేశారు.
ఎంపీ మండపానికి రేషన్ బియ్యం...బాధ్యులపై వేటు - అనకాపల్లి రేషన్ అక్రమ తరలింపు వార్తలు
పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టడంపై అధికారులు చర్యలు చేపట్టారు. విచారణలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన అధికారులు.. ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు.
Authorities take action on illegal ration of rice at anakapalli in visakhapatnam