విశాఖ జిల్లాలోని సింహాచలం, భైరవవాక, విజయరామపురం, అగ్రహారంలో 124 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను చిన్నగాదిలి ఎమ్మార్వో ఆధ్వర్యంలో తొలగిస్తున్నారు. 30 ఎకరాలకు అనుమతులు ఉండగా మిగతా భూముల్లో కూడా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అది ప్రభుత్వ భూమి కావటంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు ఎమ్మార్వో నరసింహమూర్తి తెలిపారు. అక్రమాలను తొలగించిన స్థలంలో రెవెన్యూకు సంబంధించిన బోర్డును అధికారులు పెట్టారు. ఈ భూముల్లో రేకుల షెడ్లు వేసుకుని చాలా మంది నివాసముంటున్నారు. వారికి పదేపదే చెప్పినా తొలగించకపోవటంతో అధికారుల అనుమతి తీసుకుని తొలగించామని ఎమ్మార్వో తెలిపారు.
విశాఖ జిల్లాలో అక్రమ నిర్మాణాల తొలగింపు - విశాఖ జిల్లాలో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టిన అధికారులు
విశాఖ జిల్లాలోని సింహాచలం, విజయరామపురం, అగ్రహారంలోని 124 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు.
అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న అధికారులు
TAGGED:
విశాఖ జిల్లా తాజా వార్తలు