విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం బలిపురం గిరిజన గ్రామంలో పదిరోజుల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలు మృత్యువాతపడ్డారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఉన్నపలంగా మరణిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆ గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై ఈటీవీ, ఈటీవీ భారత్లో కథనాలు ప్రసారమయ్యాయి.
'ఈటీవీ భారత్' కథనంతో గిరిజనులకు వైద్య పరీక్షలు - balipuram village news
విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం బలిపురంలో పదిరోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. దీనిపై ఈటీవీ, ఈటీవీ భారత్ కథనాలు ప్రసారం చేయటంతో వైద్య అధికారులు స్పందించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్థానికులకు పరీక్షలు నిర్వహించారు.
Authorities conducted medical tests to tribals in response to the ETV BHARAT article
దీనిపై దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు స్పందించారు. వైద్యాధికారి రాజేష్ కుమార్, సిబ్బంది కలిసి బుధవారం బలిపురంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గిరిజనులకు వైద్య పరీక్షలు జరిపారు. మందులు అందించి, వ్యాధులపై అవగాహన కల్పించారు.