ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాచలంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు - lakshmi narasimha swami temple in simhachalam news

రాష్ట్రంలో కొన్ని ఆలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో సింహాచలం దేవస్థానం అప్రమత్తమైంది. సింహాద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పోలీసు అధికారుల సూచనలు తీసుకుంది.

simhachalam temple
simhachalam temple

By

Published : Oct 2, 2020, 4:05 PM IST

ఆలయ రథాన్ని పరిశీలిస్తున్న అధికారులు

విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన స్వామి వారి సన్నిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 47 లక్షల రూపాయలతో 247 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. రాష్ట్రంలోని దేవాలయాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో సింహాచల దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు పరిశీలించాలని విశాఖ నగర పోలీసు కమిషనర్​కు లేఖ రాశారు. సీపీ ఆదేశాల మేరకు బాంబు స్క్వాడ్ విభాగం ఎస్సైలు శుక్రవారం ఆలయాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దేవస్థానం ప్రతిపాదించిన ప్రాంతాలను ఈఈ కోటేశ్వరరావు వివరించారు.

ఆలయానికి ఉన్న మూడు రాజ గోపురాల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు పోలీసు సిబ్బంది సూచించారు. ఆలయ బంగారం ఉంచే ప్రదేశం చుట్టూ సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పారు. అలాగే స్వామి వారి రథానికి ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేయాలని సూచించారు

ABOUT THE AUTHOR

...view details