ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భూముల రీ సర్వే కోసం అధికారులకు శిక్షణ' - ఏపీలో భూముల రీ సర్వే

భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కచ్చితమైన కొలతలతో పక్క రికార్డులు తయారీకి వీలుగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. సెంటీమీటరు సైతం లెక్క కట్టగలిగే ఆధునిక పరికరాల వినియోగం పై విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ సచివాలయం సర్వేయర్​లో శిక్షణ పొందుతున్నారు.

Authorities are preparing for a land re-survey
భూముల రీ సర్వే

By

Published : Aug 21, 2020, 7:18 AM IST

గ్రామాల్లో నిత్యం తగాదాలకు కారణమవుతున్న భూరికార్డుల ప్రక్షాళన కొన్ని దశాబ్దాలుగా ఘర్షణల మధ్య అలాగే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక సహాయంతో ఇతర సమాచారాన్ని రూపొందించి ఏ వివాదాలకు తావు లేకుండా చూడాలని భావిస్తోంది. సచివాలయాల సర్వేయర్లతో దీనిని విజయవంతంగా పూర్తి చేయాలని తలపెట్టింది. అందుకోసమే వారికి ఆధునిక యంత్ర పరికరాలు సాఫ్ట్​వేర్​లపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. భూముల సర్వేకు ఇటీవల వరకు ఇనుప గొలుసులు ఇతర పరికరాలు వినియోగించేవారు. ప్రస్తుతం కచ్చితమైన భూ లెక్కల కోసం ఆధునిక ఎలక్ట్రికల్ టోటల్ స్టేషన్. డీజీపీఎస్, జీపీఎస్ తదితర పరికరాలు వినియోగానికి చర్యలు తీసుకుంటున్నారు .

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని సర్వే అకాడమీలో తర్ఫీదు పొందిన మాస్టర్ ట్రైనర్.. మండల సర్వేయర్లు విశాఖ జిల్లాలోని నర్సీపట్నం పాడేరు డివిజన్లలో ఎంపిక చేసిన 10మందిని సచివాలయం సర్వేయర్ క్షేత్రస్థాయిలో తర్ఫీదు ఇస్తున్నారు. మీరు శిక్షణ పూర్తి చేసుకుని మిగతా సర్వర్లకు వీటి పై పూర్తి అవగాహన కల్పిస్తారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో 10 మండలాలకు సంబంధించి సుమారు 57 వేల సర్వే నంబర్​లోని సుమారు 3.74 లక్షల ఎకరాల భూముల్లో భూ సమాచారం కోసం రీ సర్వేకు ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఇదీ చూడండి.అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా విజయవాడ

ABOUT THE AUTHOR

...view details