శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని అరబిందో ఫార్మా కంపెనీ కార్మికులు విశాఖలో ధర్నా చేశారు. అరబిందో యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... అక్కయ్యపాలెంలోని న్యాయ దీక్ష చేశారు. కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్ల చార్టర్ను యాజమాన్యానికి... ఇచ్చి సుమారు 18 నెలలు గడుస్తున్నా పట్టించుకోలేదని వాపోయారు. సమస్యలను పరిష్కరించాలని... లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
అరబిందో ఫార్మా కంపెనీ కార్మికుల ధర్నా - Aurobindo Pharma Company workers protes news
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని అరబిందో ఫార్మా కంపెనీ కార్మికులు... విశాఖలో ఆందోళన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ధర్నాచేస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ కార్మికులు
అరబిందో ఫార్మా కంపెనీ కార్మికుల ధర్నా