ఆంధ్ర, గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయాల్లో పీజీ, ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి మే 9,10 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షల సంచాలకుడు ఆచార్య నిమ్మ వెంకటరావు వివరించారు. దరఖాస్తుల సమర్పణకు నేడే ఆఖరు గడువని తెలిపారు. అపరాధ రుసుముతో ఈనెల 25 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు 20వేల 379 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈనెల 28 నుంచి హాల్టికెట్లు పొందవచ్చన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరులో ప్రరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఏయూ సెట్.. ప్రవేశ పరీక్షా తేదీల ప్రకటన
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విజయనగరం గురజాడ అప్పారావు యూనివర్శిటీలో ప్రవేశాలకు సంబంధించి.. మే 9, 10 తేదీల్లో పరీక్షలను నిర్వహించున్నారు.
ఏయూ సెట్ ప్రవేశ పరీక్షా తేదీల ప్రకటన