భాషా శాస్త్రాలను నిరంతరం అధ్యయనం చేయాలని ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి అన్నారు. ఏయూ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, భాషా పరిశోధకులు చల్లా కృష్ణవీర్ రచించిన "గదబ" లాంగ్వేజ్ లైఫ్ స్కిల్స్ పుస్తకాన్నిఆయన ఆవిష్కరించారు. అంతరించిపోతున్న ఆదివాసి భాషపై అధ్యయనం చేయడం.. దానికి ఓ పుస్తక రూపం ఇవ్వడం మంచి పరిణామమని చెప్పారు. పుస్తక రచయితను అభినందించారు.
భాషా శాస్త్రాలను అధ్యయనం చేయాలి: ఏయూ వీసీ
ఏయూ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, భాషా పరిశోధకులు చల్లా కృష్ణవీర్ రచించిన గదబ లాంగ్వేజ్ లైఫ్ స్కిల్స్ పుస్తకాన్ని ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి ఆవిష్కరించారు. అంతరించి పోతున్న ఆది వాసి భాషపై అధ్యయనం చేయడం.. దానికి ఓ పుస్తక రూపం ఇవ్వడం మంచి పరిణామమని చెప్పారు.
au vc released book which is written by krishna veer
అంతరించి పోతున్న గదబ భాషను భావి తరాలకు పరిచయం చేస్తామని పుస్తక రచయిత కృష్ణవీర్ చెప్పారు. గదబ భాషను నేర్చుకునే వారికి అవసరమైన పదజాలాన్ని జోడిస్తూ ఈ పుస్తకాన్ని తెచ్చామన్నారు. భాష పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తెచ్చినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:అనారోగ్యంతో భార్య మృతి.. రోదిస్తూ గుండెపోటుతో భర్త మృతి