విశాఖ జిల్లా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అపరాథ రుసుములు తగ్గించాలని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పెంచిన ఫీజులు తగ్గించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా అధికారులు స్పందించలేదని విద్యార్థులు వాపోయారు. ఎలాంటి నోటీసులు లేకుండా సెమిస్టర్‌కు 4 వందలు అపరాధ రుసుము పెంచటాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉపకులపతి, రిజిస్ట్రార్ కార్యాలయాలు ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఫీజులు తగ్గించేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వీసీ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైఠాయించారు.
అపరాధ రుసుములు తగ్గించాలని ఏయూలో విద్యార్థుల ఆందోళన
భారీగా పెంచిన అపరాధ రుసుములు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని భారీగా మోహరించటంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.
ఏయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు