ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ రమేశ్‌బాబు భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఓ విద్యార్థినిని లోబరుచుకొని, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థినిని విచారించారు. అయితే విద్యార్థిని ఎటువంటి విషయం చెప్పకపోవటంతో కౌన్సిలింగ్ నిర్వహించి.. వివరాలు తరువాత సేకరిస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.
'విద్యార్థినిపై నా భర్త లైంగిక దాడి చేశాడు' - sexual allegation on au professor
తన భర్త ఓ విద్యార్థినితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడంటూ ఓ ప్రొఫెసర్ భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పని చేస్తున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య