సెమిస్టర్ ఫీజులపై అపరాధ రుసుం పెంచడాన్ని వ్యతిరేకిస్తూ... ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేశారు. అపరాధ రుసుం 55 రూపాయలుగా నోటీస్ బోర్డులో ప్రకటించి... ఒక్కో సెమిస్టర్‌కు 400 రూపాయలు పెంచడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా... ఇష్టానుసారంగా రుసుం పెంచడం సమంజసం కాదన్నారు.
వర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ... వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే దారులను నిర్బంధించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం నుంచి వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే దారిలో.. మానవహారంగా ఏర్పడి శాంతియుత నిరసన తెలిపారు. పెంచిన అపరాధ రుసుం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు.