విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అర్జునగిరిలో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామంలోని శివారు ప్రాంతంలో నాటుసారా తయారీ చేస్తున్నట్లు సమాచారంతో విస్తృత సోదాలు చేశారు.
నాటుసారా తయారికి సిద్ధంగా ఉంచిన 250 లీటర్ల బెల్లం ఊటను గుర్తించారు. బెల్లం ఊటను పారబోసి, సామగ్రి ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎస్.ఐ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.