ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హరియాణా దొంగలు.. ఏటీఎంలలో చేస్తారు ఘరానా చోరీలు!

వేరే రాష్ట్రం నుంచి నగరానికి వచ్చారు. అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఏటీఎంలలో నగదు చోరీలకు పాల్పడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా దొంగతనం చేస్తున్నామని భావించారు. అయితే తప్పు చేసే ప్రతిఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడతారన్నట్లుగా వారూ పోలీసులకు దొరికిపోయారు. హరియాణా నుంచి వచ్చి విశాఖ ఏటీఎంలలో ఘరానా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

atm-thieves-caught-by-police-in-vizag
హరియాణా దొంగలు.. ఏటీఎంలలో చేస్తారు ఘరానా చోరీలు!

By

Published : Aug 24, 2020, 1:48 PM IST

Updated : Aug 24, 2020, 4:20 PM IST

హరియాణా దొంగలు.. ఏటీఎంలలో చేస్తారు ఘరానా చోరీలు!

హరియాణా నుంచి విశాఖపట్నం వచ్చి ఏటీఎంలలో నగదు కొల్లగొడుతున్న ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 76వేల నగదు, 34 ఏటీఎం కార్డులు, ఏటీఎం కేంద్రాల నకిలీ తాళాలు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసును ఛేదించిన తీరును.. పోలీసులు వివరించారు. హరియాణాకు చెందిన ఆకిబ్ ఖాన్, ముబారక్ అనే ఇద్దరు యువకులు జులై నెల మొదటివారంలో విమానంలో నగరానికి వచ్చారు. డాబా గార్డెన్స్​లోని ఓ లాడ్జిలో అద్దెకు దిగారు. బీచ్ రోడ్డులో ఉన్న ఓ బైకులు అద్దెకిచ్చే షాపులో ఓ ద్విచక్రవాహనాన్ని రెంటుకు తీసుకున్నారు. నగరంలో సెక్యురిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో పరిశీలించారు. ఆ తర్వాత వారి పని మొదలుపెట్టారు. గత నెల 7, 8 తేదీల్లో బిర్లా కూడలి వద్ద ఉన్న ఎస్​బీఐ ఏటీఎంకు వెళ్లి లక్షా 3 వేల నగదు డ్రా చేశారు. 22వ తేదీన రూ. 19,500 చొప్పున రెండుసార్లు డ్రా చేశారు.

నగదు కొల్లగొట్టే విధానం

నగదు విత్ డ్రా చేసే సమయంలో వీరు తెలివితేటలను ప్రదర్శిస్తారు. తమ బంధువులు, స్నేహితుల నుంచి తెచ్చిన ఏటీఎం కార్డులను చోరీకి వినియోగిస్తారు. ఆ కార్డును ఏటీఎంలో పెట్టి నగదు బయటకు వస్తున్న సమయంలో తమ వద్ద ఉన్న నకిలీ తాళాలతో మెషీన్ డోర్ తెరిచి విద్యుత్ సరఫరా ఆపివేస్తారు. ఆ తర్వాత నగదును బలవంతంగా బయటకు తీస్తారు. దీంతో లావాదేవీలకు సంబంధించిన సమాచారంలో అంతరాయం కలిగి నగదు బదిలీ అయిన విషయం బ్యాంకులకు చేరదు. అయితే కార్డుదారునికి ఖాతాలో డబ్బులు విత్ డ్రా అయినట్లు సందేశం వస్తుంది. మళ్లీ మూడు రోజుల్లో విత్ డ్రా అయిన నగదు తిరిగి వారి ఖాతాలో చేరుతుంది. కరెంట్ పోయి ఉండడం వల్ల నగదు తిరిగి ఏటీఎంలోకి వచ్చేసి ఉంటుందని బ్యాంకు వాళ్లు భావిస్తారు. ఈ విధంగా వారు ఘరానా చోరీలకు పాల్పడ్డారు. ఆయా కార్డులు ఇచ్చిన బంధువులకు, స్నేహితులకు కొంత మొత్తం అందజేస్తారు.

దొరికిపోయారిలా...

నెలాఖరులో ఏటీఎం నగదు లెక్కల్లో తేడా రావటంతో బ్యాంకు అధికారులు ఈనెల 21న కంచరపాలెం క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏటీఎం కేంద్రాల వద్ద సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

కొత్త విద్యావిధానంలో ఆర్భాటమే అధికం?

Last Updated : Aug 24, 2020, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details