ఒక పక్క పరవాడ ఫార్మసీ, మరో వైపు అచ్యుతాపురం పారిశ్రామిక వాడ... నిత్యం వందలాది వాహనాలు తిరిగే రహదారి. ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం కూడలికి ఇటు అటు రెండు కిలోమీటర్ల మేర గుంతలు పడ్డాయి. వీటి వల్ల వాహనాలు కదల్లేక పోతున్నాయి. పరవాడ నుంచి ఎలమంచలి వరకు రోడ్ నిండా ఇలాగే గతుకులు... వాహనదారులను ఇబ్బంది పెడుతున్నాయి. ద్విచక్రవాహనదారులు అయితే ఈ రోడ్డులో రావడానికి హడలిపోతున్నారు.
నిత్యం రద్దీగా ఉండే దారి.. గుంతల మయమైతే ఎలా వెళ్లేది? - గాజువాక ఎలమంచలి రోడ్డులో గుంతలు న్యూస్
నిత్యం రద్దీగా ఉండే గాజువాక - ఎలమంచలి రోడ్.. చినుకు పడితే ఛిద్రం అవుతోంది. భారీ వాహనాలు కూడా కదల్లేకుండా.. పెద్ద గోతుల నిండా నీరు నిలుస్తోంది. అక్కడి రోడ్డు దుస్థితిపై వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
నిత్యం రద్దీగా ఉండే రహదారి.. గుంతల మయం