విశాఖలో పల్లా శ్రీనివాసరావు భవనం కూల్చడాన్ని ఖండిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చడం దారుణమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇంట్లో మనుషులు లేని సమయం చూసి దొంగలు పడతారని విమర్శించారు. కోర్టు సెలవురోజే తెదేపా నేతల ఇళ్లు, భవనాలు కూల్చివేస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పల్లా దీక్ష చేశారన్నారు. పల్లాపై వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు దుర్మార్గమని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదు.. తగిన మూల్యం చెల్లించక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చడం దారుణం: అచ్చెన్నాయుడు
వైకాపా ప్రభుత్వం పాలన గాలికొదిలేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విశాఖలో పల్లా భవనం కూల్చడాన్ని ఆయన ఖండించారు.
నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చడం దారుణం: అచ్చెన్నాయుడు