లాక్డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులకు, యాచకులకు పలువురు సేవలు చేస్తున్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటిలో నిరాశ్రయుల కోసం ప్రత్యేక ఆశ్రమ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను ఈ కేంద్రం ఏర్పాటు కోసం కేటాయించారు. వలస కూలీలు, నిరాశ్రయులు, దూరప్రాంతాల నుంచి వస్తూ మార్గమధ్యంలో చిక్కుకుపోయిన వారు ఇక్కడ ఉండేందుకు వీలు కల్పించారు. వీరికి భోజన ఏర్పాట్లు చేశారు.
ఎలమంచిలిలో నిరాశ్రుయులకు నీడ - ఎలమంచిలిలో లాక్డౌన్
కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వలస కూలీలకు, నిరాశ్రయులకు ఉండటానికి వీలుగా విశాఖ జిల్లా ఎలమంచిలిలో ఓ ఆశ్రమకేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఎలమంచిలిలో నిరాశ్రుయులకు ఆశ్రమం