విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్ను ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ...జిల్లాకు సంబంధించి పట్టణ పరిధి, ఏజెన్సీ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం అనే మూడు విభాగాలుగా విభజించామని తెలిపారు. నాటు సారా తయారీకి సంబంధించి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగానే తయారీదారులతోపాటు.. దాని తయారీకి ముడిసరుకు అందించే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానంగా గంజాయి కేసుల వ్యవహారంలో విద్యార్థులకు, ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
సారా నివారణకు ప్రత్యేక చర్యలు.. - విశాఖలో గంజాయి వార్తలు
నాటుసారా తయారీపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ తెలిపారు. నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్ను ఆయన సందర్శించారు.
మీడియాతో మాట్లాడుతున్న ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్