ఆంధ్ర విశ్వ విద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆసెట్ నోటిఫికేషన్ ను వారం రోజుల్లో విడుదల చేస్తామని వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి తెలిపారు. జులై మొదటి వారం నుంచి డిగ్రీ పరీక్షలను నిర్వహిస్తామన్నారు.
పీజీ ద్వితీయ సంవత్సర పరీక్షలను జులై 1 నుంచి 15 వరకు, ప్రథమ సంవత్సరం పరీక్షలు జులై 16 నుంచి 30వ వరకు జరుగుతాయని వివరించారు. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం పరీక్షల ఫలితాలను ఈనెల 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం కోసం ఏయూ వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.