విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. సింహగిరి చేరుకున్న వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్య కళ.. స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు తీర్థప్రసాదం అందజేశారు. సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలన చేస్తున్నారని స్పీకర్ అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున తాను మాట్లకూడదని స్పష్టం చేశారు.
సింహాద్రి అప్పన్న సేవలో స్పీకర్ దంపతులు - స్పీకర్ తమ్మినేని సీతారాం తాజా సమాచారం
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నను శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం.. సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి.. ప్రత్యేక పూజలు చేశారు.
సింహాద్రి అప్పన్న సేవలో స్పీకర్ దంపతులు