విశాఖలో జీవీఎంసీ ప్రధాన ద్వారం ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. జనవరి నుంచి బకాయి పడ్డ పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంత పని చేసినా 6వేల రూపాయలలోపే చెల్లింపులు జరుగుతున్నాయని దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆరోపించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించటం వల్ల సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించి... సంక్షేమ పథకాలు తమకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బకాయిలు చెల్లించాలంటూ ఆశా వర్కర్ల ఆందోళన
శ్రమకు తగ్గ పారితోషికం దక్కటం లేదని ఆరోపిస్తూ విశాఖలో ఆశా వర్కర్స్ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన 8వేల600 రూపాయల పారితోషికాల సర్క్యులర్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీలింగ్ లేకుండా పని చేసిన మేరకు జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
బకాయిలు చెల్లించాలంటూ విశాఖలో ఆశా వర్కర్స్ ఆందోళన