విశాఖ జిల్లా చోడవరంలో ఆశావర్కర్లు ధర్నా చేపట్టారు. కేంద్రం పెంచిన పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్, అంగన్వాడీ, ఆశ, విఓఎల బకాయి వేతనాలు అందజేయాలని కోరారు. లాక్డౌన్ కాలాన్ని వేతనాలతో కూడిన సెలవు దినంగా ప్రకటించాలన్నారు. ఆశావర్కర్ల జిల్లా అధ్యక్షురాలు కురచా వరలక్ష్మి, బొద్దాన రామలక్ష్మి, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
బకాయిలు చెల్లించాలంటూ ఆశా వర్కర్ల ధర్నా - చోడవరంలో ఆశ వర్కర్స్ ధర్న
విశాఖ జిల్లాలో ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. పెంచిన పని గంటలు తగ్గించాలని.. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆశ వర్కర్స్ ధర్నా
ఇది చదవండి