విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వద్ద ఆశ కార్యకర్తల డిమాండ్స్ డేను నిర్వహించారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి వద్ద కార్యకర్తలంతా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం ప్రాంతంలోని పలువురు ఆశా కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు ఆర్ లక్ష్మీ గణపతి, రేవతి, వెంకట వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆశా కార్యకర్తల డిమాండ్స్ డే - విశాఖ జిల్లా
సీఐటీయు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వద్ద ఆశ కార్యకర్తల డిమాండ్స్ డే ను నిర్వహించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.

ఆశా కార్యకర్తలు డీమాండ్స్ డే