ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంస్కృతి సాంప్రయదాయాలకు భారతదేశం వారధి' - vishakha music arist pramotions programme

సంస్కృతి సాంప్రయదాయాలకు భారతదేశం వారధి అని ఆదాయపు పన్నుల అదనపు కమిషనర్ సత్యనారాయణ రాజు అన్నారు. కరోనా వల్ల కళాకారులకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. విశాఖలోని ద్వారాకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కళాకారుల ప్రోత్సాహక పారితోషకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

vvs foudation
విశాఖలో కళాకారుల ప్రోత్సాహక కార్యక్రమం

By

Published : Apr 4, 2021, 9:15 PM IST

విశాఖలోని ద్వారాకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కళాకారుల ప్రోత్సాహక పారితోషకాల పంపిణీ కార్యక్రమానికి ఆదాయపు పన్నుల అదనపు కమిషనర్ సత్యనారాయణ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వి.వి.ఎస్ ఫౌండేషన్, ఇండియా సామా ఆర్ట్స్ 11సి యుఎస్ఏ సంస్థ తరపున ప్రముఖ వయోలినిస్ట్ మురారి.. కళను ప్రోత్సహించడానికి ముందుకు రావడం హర్షణీయమని ఆయన అన్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 150 మంది కర్ణాటక శాస్త్రీయ సంగీత కళాకారులతో ఆన్ లైన్ కచేరీలు నిర్వహించి ప్రోత్సాహక పారితోషకాలు ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు.

అనంతరం కళాకారులకు పారితోషకం చెక్కులను అందజేశారు. దక్షినోత్సవం పేరిట నాలుగు రాష్ట్రాల్లో 35 కచేరీలు ఆన్ లైన్ ద్వారా నిర్వహించి తద్వారా వచ్చిన విరాళాలను 150 కళాకారులకు పారితోషకంగా అందజేశామని చెన్నై కి చెందిన ప్రముఖ వయోలినిస్ట్, వివి.ఎస్ ఫౌండేషన్ అధ్యక్షులు వి.వి.ఎస్. మురారి చెప్పారు. విశాఖకు చెందిన 20 మంది కళాకారులు వారిలో ఉన్నట్టు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details