విశాఖ జిల్లా అనకాపల్లి విజయరామరాజు పేటలో శిశువును అపహరించిన నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా చెరుకుపాలెంకి చెందిన రాయపాటి కుమారి భర్త పోలారావుతో కలిసి పట్టణంలో నివసిస్తోంది. నెలరోజుల క్రితం కుమారి పండంటి బాబుకు జన్మనిచ్చింది. బాబును బెంగళూరుకు చెందిన ఓ దంపతులకు అమ్మడానికి బాలుడి తండ్రి చోడే అప్పారావు, అన్నపూర్ణ అనే ఇద్దరితో అంగీకారం కుదుర్చుకున్నాడు.కానీ దీనికి బాలుడి తల్లి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 1 వ తేదీ రాత్రి సమయంలో బాలుడి అపహరణ జరిగింది. దింతో బాధిత మహిళ అనకాపల్లి పట్టణ పోలీసులను ఆశ్రయించింది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.
శిశువును అపహరించిన నిందితుల అరెస్ట్ - vishaka
నిద్రిస్తున్న శిశువును అర్థరాత్రి అపహరించిన నిందితులను అనకాపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పాపను తల్లిందడ్రుల చెంతకు చేర్చారు.

నిందితుల అరెస్ట్