ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆలయంలో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఆలయంలో అమావాస్య పూజలు జరిగాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈనెల 17వ తేదీన కలశ స్థాపనతో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
18వ తేదీన సూర్య నమస్కారాలు, 19వ తేదీన రుద్రాభిషేకం, దీపాలంకరణ సేవ, 20వ తేదీన సప్త ప్రాకార సేవ, 21న సరస్వతి పూజ, 22న శ్రీ చక్రంకి అభిషేకం, 23న మాతృ త్రయోరాధన, చండీహోమం, 24న తోమాల సేవ, 25న మూల విరాట్ కి క్షీరాభిషేకం, శమిపూజ, 26న పూర్ణాహుతి అవవృధ స్నానం నిర్వహిస్తారు. ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయంలో దసరా ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాదాయ శాఖ అధికారిని అన్నపూర్ణ తెలిపారు.