విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న తెప్పోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం స్వామివారి పుష్కరిణిలో నిర్వహించే.. ఈ నౌకా విహారానికి నేడు ట్రయల్ రన్ నిర్వహించానున్నారు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ అమావాస్య రోజు స్వామివారిని.. శ్రీ కృష్ణ అలంకారంలో ఉభయ దేవేరులతో సింహగిరి కిందకు తీసుకువచ్చి తెప్పోత్సవం నిర్వహిస్తారు.
సింహాచలంలో తెప్పోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామివారికి తెప్పోత్సవం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది పుష్య బహుళ అమావాస్య రోజు స్వామివారు శ్రీ కృష్ణ అలంకారంలో ఉభయ దేవేరులతో సింహగిరి కిందకు వచ్చి తెప్పోత్సవం జరిపించుకుంటారు.
సింహాచలంలో తెప్పోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
స్వామివారి పుష్కరిణి మధ్య ఉన్న మండపంలో విశేష ఆరాధనలు జరుపుతారు. 3 సార్లు ప్రదక్షిణ జరిపి అనంతరం గ్రామ తిరువీధి జరిపించుకుని మెట్ల మార్గం ద్వారా సింహగిరి చేరుకుంటారు. తిరువీధికి స్వామి, అమ్మవార్లను సర్వజన మనోరంజక వాహనంపై ఊరేగిస్తారు. ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. దేవస్థానంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ.. ఏర్పాట్లను చేస్తోంది.
ఇదీ చదవండి: సర్పంచి పోరులో 80 ఏళ్ల బామ్మ
TAGGED:
teppostavam at Simhachalam