సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోన్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరం
గ్రేటర్ విశాఖపట్నం హోరా హోరీ పోరులో గెలిచిన కార్పొరేటర్లకు స్వాగతం పలికేందుకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వార్డుల పునర్విభజన అనంతరం 98 స్థానాలకు పెరిగిన కౌన్సిల్ సీట్లకు అనుగుణంగా నూతన సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు.