Visakha Polamamba Jathara Arrangements: విశాఖలోని శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. గత నెల 26వ తేదీన చాటింపుతో ప్రారంభమైన పోలమాంబ అమ్మవారి పండుగ జాతర.. ఈ నెల మూడో తేదీన తొలేళ్ల ఉత్సవం, నాలుగో తేదీన జరుగబోయే అమ్మవారి నిమర్జన కార్యక్రమంతో ఉత్సవం ముగుస్తుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది. విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు.. ఈ జాతరకు ప్రతి ఏటా హాజరవుతారు. ఈ నేపథ్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు ఎలాంటి ఎవాంఛనీ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆలయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి కె.శిరీష తెలిపారు.
కరకచెట్టు పోలమాంబ జాతరకు సర్వం సిద్ధం.. భారీ బందోబస్తు ఏర్పాట్లు.. - కరకచెట్టు పోలమాంబ నిమర్జన ఉత్సవం
Visakha Polamamba Jathara Arrangements: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పోలమాంబ అమ్మవారి ఉత్సవం.. ఈ నెల నాలుగో తేదీన జరుగబోయే అమ్మవారి నిమర్జన కార్యక్రమంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉత్సవానికి హాజరయ్యే భక్త జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
అదేవిధంగా వివిధ శాఖలతో సమన్వయంతో ఈ ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఆలయ ధర్మకర్తలు, గ్రామస్థులు, అధికారులతో కలిసి రెండుసార్లు సమావేశం ఏర్పాటు చేసి.. ఉత్సవాల నిర్వహణపై చర్చించుకున్నట్లుగా ఆమె తెలిపారు. దీనిలో భాగంగా జీవీఎంసీ వాళ్లు మొబైల్ టాయిలెట్స్, శానిటేషన్స్ విషయంలో సహకారం అందిస్తామని తెలిపినట్లు ఆమె అన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ వారు తమ సిబ్బందిని ఏర్పాటు చేసి.. ట్రాఫిక్ డైవర్షన్, విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటామని చెప్పినట్లు శిరీష తెలిపారు. దీంతోపాటు దేవాదాయ శాఖ నుంచి సుమారు 100 మంది సిబ్బందిని, సేవాసంఘాల వారిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇలా భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆమె చెప్పారు. దీంతోపాటు ఈ నెల 11న జరగబోయే మారువారం పండుగకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
"పోలమాంబ అమ్మవారిని గ్రామదేవతగా భావించి ప్రతి ఏటా ఇక్కడ మేము జాతర మహోత్సవాలను నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం మార్చి 4వ తేదీన నిమర్జన కార్యక్రమంను నిర్వహించనున్నాము. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రతి ఏటా అధిక సంఖ్యలో భక్త జనాలు తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉత్సవంలో భక్తులకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయటంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశాము."
- కే.శిరీష, దేవస్థానం చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి