విశాఖలోని ఎంవీపి కాలనీలోని అళ్వార్ దాస్ మైదానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 23,24,25 తేదీలలో అభిషేకము, హరినామ జపయజ్ఞము, ఉయ్యాలసేవ వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు హరికృష్ణ మూవ్ మెంట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. జన్మాష్టమి రోజున ఉట్టి మహోత్సవంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు వచ్చే భక్తులకు తీర్ధ ప్రసాదాలతో పాటు భగవద్గీత గ్రంధ వితరణ చేయనున్నట్లు తెలిపారు. నగర వాసులంతా పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు.... - విశాఖలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు....
ఆగష్టు 23వతేదీ నుంచి మూడురోజులపాటు విశాఖలోని అళ్వార్ దాస్ మైదానంలో ..... శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు హరికృష్ణ మూవ్ మెంట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.

విశాఖలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు....
విశాఖలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు....
ఇవీ చదవండి