ప్రభుత్వ ఆదేశాల మేరకు పేదలకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి చదువులవారి వీధిలోని రేషన్ దుకాణంలో సరకుల కోసం లబ్దిదారులు గుమిగూడారు. కనీసం సామాజిక దూరం పాటించకుండా రద్దీగా నిల్చుని సరకులు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రేషన్ డిపో వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అమర్నాథ్ ఆదేశాల మేరకు అధికారులు.. అనకాపల్లి రేషన్ దుకాణం వద్ద టెంట్లు ఏర్పాటు చేశారు. ఇదే విధానాన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల చౌకధరల దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఎమ్మెల్యే స్పందన.. తీరిన రేషన్ లబ్దిదారుల కష్టాలు - ration rice distribution in anakapalli
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని ఓ రేషన్ దుకాణం వద్ద లబ్దిదారులు పడుతున్న అవస్థపై స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ స్పందించారు. చౌకధరల దుకాణాల వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశం మేరకు అధికారులు రేషన్ దుకాణం వద్ద టెంట్లు ఏర్పాటు చేశారు.

అనకాపల్లి రేషన్ దుకాణం వద్ద లబ్దిదారుల సౌకర్యార్థం ఏర్పాట్లు
అనకాపల్లి రేషన్ దుకాణం వద్ద లబ్దిదారుల సౌకర్యార్థం ఏర్పాట్లు
ఇదీ చదవండి.
రేషన్ సరకుల్లో పురుగులు...తినేదెలా..?
TAGGED:
a ration shop in anakapalli