ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విలువిద్యలో మేటి.... వెళ్లలేరు దేశం దాటి - విశాఖ ఏజెన్నీలో విలువిద్యకు శిక్షణ

విలువిద్య పుట్టినిల్లు విశాఖ మన్యం. విల్లంబులు ధరించి జంతువులు వేటాడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చిన్నప్పటి నుంచే చిన్నచిన్న బాణాలు చేసుకుంటూ గురి చూసి కొట్టడం అనేది మన్యం పుత్రులకు ఓం నేర్పరితనం. వారి శిక్షణపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

విలువిద్యలో మేటి.... వెళ్లలేరు దేశం దాటి

By

Published : Oct 7, 2019, 12:40 AM IST

విశాఖ ఏజెన్సీ పాడేరులో వనవాసి కళ్యాణ్ ఆశ్రమం పరశురామ్ ఆర్చరీ అకాడమీలో గిరిజన విద్యార్థిని విద్యార్థులకు విలువిద్య క్రీడలు శిక్షణ ఇస్తున్నారు మన్యంలో విలువిద్యపై మక్కువ కలిగినటువంటి విద్యార్థులు ముందుకు వచ్చి నేర్చుకుంటున్నారు. దాతల సాయంతో ఉచితంగా వసతి కల్పించి తర్ఫీదు ఇస్తున్నారు. విద్యార్థులు ఎంతో పట్టుదల శ్రద్ధతో నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.


పాఠశాల స్థాయి, రాష్ట్రస్థాయి విలువిద్య క్రీడా విభాగంలో పోటీలకు సిద్ధమవుతూ విద్యార్థులు ముందుకు వెళ్తున్నారు. గతంలో జాతీయ స్థాయిలో రాణించిన ఇద్దరు యువతీ యువకులు శిక్షకులుగా ఉండి విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు విలువిద్యలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా బోధిస్తున్నారు.


విశాఖ మన్యంలో విద్యార్థులు పేదవాళ్ళు. ఖర్చుతో కూడుకున్న విలువిద్య సామగ్రి కొనుగోలు చేయాలంటే అధిక సంఖ్యలో దాతలు ముందుకు రావాల్సి ఉంటుంది. ప్రోత్సాహం ఇస్తే అంతర్జాతీయ స్థాయి తీసుకెళతామని పరశురామ్ ఆర్చరీ అకాడమీ సభ్యులు చెబుతున్నారు

విలువిద్యలో మేటి.... వెళ్లలేరు దేశం దాటి

ఇదీచూడండి

తొలి టెస్టులో గెలుపు మాదే: ఫిలాండర్

ABOUT THE AUTHOR

...view details