ముగిసిన అరకు ఉత్సవ్
విజయవంతంగా ముగిసిన అరకు ఉత్సవ్ - araku utsav latest updates
విశాఖ జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన అరకు ఉత్సవ్ విజయవంతంగా ముగిసింది. ఆఖరిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అరకు ఉత్సవాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరకు ఎంపీ మాధవి, స్థానిక ఎమ్మెల్యే పాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 'ఒరేయ్ బుజ్జి' చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ మాళవిక డాన్సులతో ఉర్రూతలూగించారు. ముగింపు ఉత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
![విజయవంతంగా ముగిసిన అరకు ఉత్సవ్ ముగిసిన అరకు ఉత్సవ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6263970-239-6263970-1583141655351.jpg)
ముగిసిన అరకు ఉత్సవ్