విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయంలో అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నాటు పడవపై విహరించారు. కొయ్యూరు మండలం అడ్డాకుల గ్రామంలో ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన వీరు సమీపంలోని జలాశయాన్ని సందర్శించారు. జలాశయానికి చుట్టూ కొండలు , ప్రకృతి రమణీయ దృశ్యాలు తిలకించి పరవశించారు. అనంతరం జలాశయం ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తాండవ జలాశయంలో అరకు ఎంపీ, పాడేరు ఎమ్మెల్యే విహారం - paderu mla bhagyalaxmi latest news
ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తాండవ జలాశయంలో విహరించారు. ఆ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి ముత్తంశెట్టితో కలిసి కృషి చేస్తామని తెలిపారు.
జలాశయంలో విహరించిన అరకు ఎంపీ, పాడేరు ఎమ్మెల్యే