ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయండి: సీఎంకు ఎంపీ మాధవి విజ్ఞప్తి - సీఎం జగన్​ను కలిసిన అరకు ఎంపీ మాధవి వార్తలు

పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్​ను విశాఖ జిల్లా అరకు ఎంపీ మాధవి కోరారు. వాటి అభివృద్ధితో గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆమె సీఎంకు వివరించారు.

Araku MP Madhavi  met CM Jagan
సీఎం జగన్​ను కలిసిన అరకు ఎంపీ మాధవి

By

Published : Mar 17, 2021, 8:42 AM IST

విశాఖ మన్యంలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్​కు విజ్ఞప్తి చేశారు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి. ఏజెన్సీలోని గుమ్మ జలపాతం (కొయ్యూరు మండలం), సరయ జలపాతం (అనంతగిరి మండలం) ను ఆధునీకరించాలని ఆమె కోరారు. డుంబ్రిగూడ మండలం చాపరాయి జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలని.. అక్కడ కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజన యువతకు ఉపాధి కల్పించడంతో పాటు.. టూరిజాన్ని ఏజెన్సీ ప్రాంతంలో విస్తరించేందుకు ఉన్న అవకాశాలను సీఎం దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు. జలపాతాల పనులకు సీఎం సానుకూలంగా స్పందించారని.. అధికారులకు అభివృద్ధి చేసేలా ఆదేశాలను జారీ చేశారని ఆమె తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details