విశాఖ జిల్లా అరకు పార్లమెంటు సభ్యురాలు గొట్టేటి మాధవి.. స్వగ్రామంలో పొలం పనులకు శ్రీకారం చుట్టారు. తమ పొలంలో పండిన వరిచేను కోయడంలో నిమగ్నమయ్యారు. శరభన్నపాలెంలో వేకువజామున నిద్రలేచి కూలీలతోపాటు పొలానికి వెళ్లారు.
పొలం పనుల్లో అరకు ఎంపీ బిజీ బిజీ - శరభన్నపాలెంలో వరికోత కోస్తున్న ఎంపీ గొట్టేటి మాధవి
ఇతర కూలీలతో కలిసి అరకు ఎంపీ గొట్టేటి మాధవి.. పొలం పనులు చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని ఆమె స్వగ్రామం శరభన్నపాలెంలో వరి కోశారు. ఎంపీ స్థానంలో ఉండి.. పొలం పనులు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
వరికోత కోస్తున్నఎంపీ గొట్టేటి మాధవి
ఏ స్థానంలో ఉన్నా పొలం పనులు చేయడం ఆనందంగా ఉంటుందని మాధవి అభిప్రాయపడ్డారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. ఏడాదికోసారి వరి పంట చేతికొస్తుందన్నారు. ఈ వారం పాటు కష్టపడి పంటను సంరక్షించుకుంటే.. మరో ఏడాది వరకు తిండి గింజలకు కొదువ ఉండదని తెలిపారు.
ఇదీ చదవండి:అంతర్జాతీయ పోటీలో సత్తా చాటిన విశాఖ