విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఆమె భర్త శివప్రసాద్ విజయవాడ స్టేషన్లో సాధారణ ప్రయాణికుల్లాగా రైలు కోసం వేచి ఉన్నారు. విజయవాడనుంచి విశాఖకు గోదావరి ప్రత్యేకరైలులో స్లీపర్ క్లాస్ టికెట్ తీసుకున్న వీరిద్దరూ ఫ్లాట్‌ఫామ్‌పై కూర్చోని కనిపించారు. వారి వెంట గన్మెన్లు కూడా లేరు. ఈ ఫోటోను పలువురు వైకాపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వీటికి స్పందించిన మాధవి భర్త.. విశాఖ లోకల్లో తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారి వెంట గన్‌మెన్స్ ఉండరని అన్నారు.
సామాన్య ప్రయాణికుల్లా ప్రజాప్రతినిధి - vijayawada news
విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఆమె భర్త శివప్రసాద్ సాధారణ ప్రయాణికుల్లా రైలు కోసం వేచి ఉన్న ఫోటో వైకాపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఆమె భర్త శివప్రసాద్