విశాఖ జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో సోమవారం సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా అరకు లోయ ఎంపీ మాధవి, ఎమ్మెల్యే పాల్గుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ సరిగాలేదని ఎమ్మెల్యే, ఎంపీ... ఎస్సైను ప్రశ్నించామన్నారు. తమ మాటలను ఎస్సై పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సదరు ఎస్సైను సస్పెండ్ చేయాలంటూ... వైకాపా కార్యకర్తలు, నాయకులు హుకుంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరూ అక్కడికి చేరుకుని... పోలీస్ అధికారులు చర్చించటంతో వివాదం సద్దుమణిగింది. తాను అన్ని కార్యక్రమాలకు హాజరయ్యానని... వారు ఎందుకు కోపగించుకున్నారో తనకు తెలియదని ఎస్ఐ చెప్పారు. తన తల్లి కంటి ఆపరేషన్‌తో కాస్త దిగాలుగా ఉన్నానని ఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు.