విశాఖ జిల్లా అరకులోయ మండలం పప్పుడు వలసలో గిరిజనుల పండుగ వేడుకల్లో అరకులోయ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పాల్గొన్నారు. గ్రామంలో గిరిజన రైతులు ఎమ్మెల్యేతో పాటు డప్పు కొట్టారు. మహిళలు గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేశారు.
విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే సందడి - గిరిజనులు పండుగ వేడుకలకు అరకులోయ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ
విశాఖ ఏజెన్సీలో అరకులోయ ఎమ్మెల్యే సందడి చేశాడు. ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ గిరిజన గూడెంలో పండుగ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. థింసా డ్యాన్స్ డప్పు కొట్టి హడావుడి చేశారు.
విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే సందడి
ఎమ్మెల్యే వారితో కలిసి నృత్యం చేశారు. డప్పు వాయిస్తూ స్థానికులను ఉర్రూతలూగించారు. తోటి నాయకులు డ్యాన్స్ వేయగా.. స్థానికులు కేరింతలు కొట్టారు. తమ హయాంలో గిరిజన రైతులు అన్ని రకాల పంటలు పండించి ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:పాడేరును కమ్మేసిన పొగమంచు