APTDC ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో విశాఖపట్నం రుషికొండ వద్ద చేపట్టిన పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టుపై న్యాయ వివాదాలు సాగుతున్నా.. రెండో దశ పనులకు గురువారం టెండరు పిలిచారు. రూ.94 కోట్ల విలువైన పనులు చేపట్టడానికి సెప్టెంబరు 8లోగా బిడ్ దాఖలుకు అవకాశం కల్పించారు. ఒప్పందం కుదిరిన 15 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని నిబంధన విధించారు. రెండో దశలో.. అక్కడక్కడ చదును చేయాలి. భవనాలకు ప్లాస్టరింగ్, పెయింటింగ్, గ్రానైట్ వేయాలి. అన్ని గదులకు తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లను అమర్చాలి. 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతానికి మొదటి దశ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో కొండ తవ్వకం దాదాపుగా పూర్తయింది. ఇటీవలే భవన నిర్మాణాన్ని ప్రారంభించారు.
న్యాయ వివాదాలున్నా ముందుకే, రుషికొండ రెండో దశ పనులకు టెండర్లు - ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ
రుషికొండ వద్ద చేపట్టిన పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టుపై ఓ వైపు న్యాయ వివాదాలు సాగుతున్నా మరో వైపు రెండో దశ పనులకు టెండరు పిలిచారు. రూ.94 కోట్ల విలువైన పనులు చేపట్టడానికి సెప్టెంబరు 8లోగా బిడ్ దాఖలుకు అవకాశం కల్పించారు. ఒప్పందం కుదిరిన 15 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని నిబంధన విధించారు.
మొదటి దశలో నిర్మించే నాలుగు భవనాలకు రెండో దశలో తుది మెరుగులు దిద్దుతారు. ఇందులో ఫాల్‌సీలింగ్, శానిటరీ పనులు, అగ్నిమాపక పరికరాల ఏర్పాటు, సీసీటీవీ పరికరాల కొనుగోలు వంటివి ఉన్నాయి. మొదటి నుంచీ రుషికొండ పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కొండ తవ్వకంతోపాటు పనులన్నీ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయని హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసులు నడుస్తున్నాయి. విశాఖ-భీమిలి మార్గంలో బీచ్ రోడ్డుకు సమీపంలో చేపట్టిన పనులు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానంలోనే కోర్టు ధిక్కరణ కేసు వేయగా... ఇది విచారణకు రానున్న తరుణంలో రెండో దశ పనులకు టెండరు పిలవడం గమనార్హం.
ఇవీ చదవండి: