ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవతా మార్గంలో.. ఆదాయ సముపార్జన

కొవిడ్ సవాళ్లను అధిగమిస్తూ పర్యటక అభివృద్ధి సంస్థ ప్రత్యామ్నాయ బాట పట్టింది. అనేక సంస్థలు కరోనా మిగిల్చిన నష్టాలను పూడ్చలేక ఉద్యోగుల్ని తొలగిస్తుంటే.. ఏపీటీడీసీ మాత్రం వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. కొవిడ్ రోగులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ సేవాస్ఫూర్తిని చాటుతోంది.

APTDC Food To Covid Patients
మానవతా మార్గంలో.. ఆదాయ సముపార్జన

By

Published : Oct 19, 2020, 5:52 PM IST

కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అన్ని రంగాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. ఏపీటీడీసీ మాత్రం కొత్త ఆలోచనలతో లాభాల బాటలో పయనిస్తోంది. కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న లక్షల మంది బాధితులకు ఈ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లతో ఆహారం సరఫరా చేస్తంది. ప్రస్తుతం రోజుకు 7 వేల 700 మందికి ఆహార పొట్లాలను సరఫరా చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని సమకూర్చుకుంది. నాలుగు లక్షల మందికిపైగా బాధితులు పౌష్టి కాహారాన్ని ఏపీటీడీసీ ద్వారా అందుకున్నారు.

ప్రత్యేక శ్రద్ధతో అందిస్తున్న ఆహారం కొవిడ్ రోగులకు సాంత్వన కలిగిస్తోంది. మధ్యాహ్న భోజనంలో కోడి మాంసంతో పాటు వేపుడు కూర, పప్పు, అన్నం అందిస్తున్నారు. రాత్రి భోజనంలో చపాతి, కూర, పప్పు, పచ్చడి ఇస్తున్నారు. వీటితో పాటు రాగిజావ, మిరియాల పాలు, పండ్ల ముక్కలు, రోజుకు మూడు గుడ్లు ఇవ్వడంతో పాటు అల్పాహారం విషయంలోనూ ప్రత్యేకత కనబరుస్తున్నారు. మొత్తం 8 జిల్లాల్లోని 11 కేంద్రాల నుంచి ఏపీటీడీసీ ద్వారా వివిధ ఆసుపత్రులకు ఆహారం సరఫరా అవుతోంది.

మంచి ఆహారం అందించడం పట్ల కొవిడ్ రోగుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. పౌష్టికాహారం తీసుకోవడం కారణంగా త్వరగా కోలుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది.

మానవతా మార్గంలో.. ఆదాయ సముపార్జన

ఇదీ చదవండి:

వరద బాధితులను పరామర్శించినందుకే నాపై విమర్శలు: లోకేశ్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details