విశాఖ ఏజెన్సీ పాడేరు ఆర్టీసీ డిపో నుంచి 14 బస్సులు రోడ్లపైకి రానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో భౌతికదూరం పాటిస్తూ తక్కువ మంది ప్రయాణికులతో బస్సులు నడపనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి బస్సుల సేవలు ప్రారంభమవుతాయని డిపో మేనేజర్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో ప్రధాన మార్గాలకు మాత్రమే 14 సర్వీసులకు అనుమతిచ్చారు. పాడేరు డిపో నుంచి అరకులోయ-3, చింతపల్లి-3, ముంచంగిపుట్టు-2, విశాఖపట్నం-2, చోడవరం-2, రాజమహేంద్రవరం-1, కాకినాడకు ఒక బస్సు నడపనున్నారు. ప్రయాణికులు టికెట్లను డిపోలో కౌంటర్ వద్ద, మండల కేంద్రాల్లో ప్రత్యేక ఆర్టీసీ కౌంటర్ వద్ద తీసుకోవచ్చు. బస్సులో డ్రైవర్ మాత్రమే ఉంటారు. మధ్యలో ఎక్కడా ప్రయాణికులను ఎక్కించుకోరు.
ఆర్టీసీ సర్వీసులకు గ్రీన్ సిగ్నల్... రేపు రోడ్డెక్కనున్న బస్సులు - విశాఖలో ఆర్టీసీ బస్సులు
దాదాపు రెండు నెలలుగా లాక్డౌన్ కారణంగా డిపోలకే పరిమితమైన బస్సులు గురువారం నుంచి రోడ్డెక్కనున్నాయి. విశాఖ జిల్లా పాడేరు డిపో నుంచి ప్రధాన ప్రాంతాలకు 14 బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.

apsrtc services in vishaka